News November 20, 2025
హిడ్మా అసలు పేరు ఇదే..

అల్లూరిలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మరణించిన మోస్ట్ వాంటెడ్ <<18318593>>హిడ్మా<<>> అసలు పేరు దేవా అని ఆయన గ్రామస్థులు తెలిపారు. హిడ్మా ఆయన తండ్రి పేరని చెప్పారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడని వెల్లడించారు. ఐదేళ్ల క్రితం అతడిని చూశామని, ఆపద ఉంటే ఆదుకునేవాడని గ్రామస్థులు పేర్కొన్నారు. పోలీసులకు లొంగిపోమని ఎన్నో సార్లు చెప్పామని అయినా హిడ్మా వినలేదని కన్నీరు పెట్టుకున్నారు.
Similar News
News November 24, 2025
వాయుగుండం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ద.అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుందని APSDMA వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో తుఫానుగా మారుతుందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అంచనా వేసింది. వీటి ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
News November 24, 2025
ముగిసిన జీ20 సమ్మిట్.. తిరుగు పయనమైన మోదీ

సౌతాఫ్రికా వేదికగా జరిగిన జీ20 సమ్మిట్ ముగిసింది. దీంతో ప్రధాని మోదీ భారత్‌కు తిరుగు పయనమయ్యారు. సదస్సు విజయవంతగా ముగిసిందని ఆయన ట్వీట్ చేశారు. వివిధ దేశాధినేతలతో ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. సమ్మిట్ చివరిరోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీ అయ్యారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా అడ్డుకోవడానికి ఇరుదేశాలు ఉమ్మడిగా పోరాడాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
News November 24, 2025
విభూది ఎందుకు ధరించాలి?

పరమ శివుడికి విభూది అంటే చాలా ఇష్టం. దీన్నే భస్మం అని కూడా అంటారు. భస్మం మన పాపాలను ప్రక్షాళన చేస్తుందని నమ్ముతారు. హోమంలో భగవంతునికి సమర్పించిన గంధపు చెక్కలు, నెయ్యి, ఇతర ఔషధాల నుంచి భస్మం తయారవుతుంది. దీన్ని ధరిస్తే.. జనన మరణ పరిధుల నుంచి బయటపడతామని, అహంకారం అంతమవుతుందని నమ్ముతారు. అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


