News November 20, 2025

గేదెలతో డెయిరీఫామ్ ఎందుకు భారమవుతోంది?

image

ఆవు పాలతో పోలిస్తే గేదె పాలకు రెట్టింపు ధర వస్తుంది. అయితే స్థానిక గేదె జాతుల్లో పాల దిగుబడి తక్కువగా ఉండటంతో ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు పాడి రైతులు. గేదెలు సకాలంలో ఎదకు రాకపోవడం, మూగ ఎద లక్షణాలు ఎక్కువగా ఉండటం, ఎక్కువ పాల దిగుబడినిచ్చే ముర్రా జాతి గేదెలు అధిక ధర ఉండటం.. అంత ధరపెట్టి కొన్నా మన వాతావరణంలో అవి ఎక్కువ పాలివ్వడకపోవడం, ఎద విషయంలో సమస్యల కారణంగా ఫామ్ నిర్వాహకులు నష్టపోతున్నారు.

Similar News

News March 19, 2026

మూడో బిడ్డకు జన్మనిచ్చిన దినేశ్ కార్తీక్ దంపతులు

image

మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య, స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి ‘రాహా పల్లికల్ కార్తీక్’గా పేరు పెట్టినట్లు DK తెలిపారు. వీరికి 2021లో కవల మగ పిల్లలు కబీర్, జియాన్ జన్మించిన విషయం తెలిసిందే. కాగా కార్తీక్ 2007లో నిఖితను వివాహం చేసుకోగా 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2015లో దీపికాను పెళ్లాడారు.

News March 19, 2026

అమెరికాలోకి డ్రోన్లు.. హై అలర్ట్‌లో వాషింగ్టన్!

image

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ వాషింగ్టన్‌లోని ఫోర్ట్ మెక్‌నాయర్ మిలిటరీ బేస్‌పై గుర్తుతెలియని డ్రోన్లు తిరగడం కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలోనే US విదేశాంగ మంత్రి రూబియో, రక్షణ మంత్రి హెగ్‌సెత్ నివాసాలు ఉండటంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. గత 10 రోజులుగా ఇక్కడ డ్రోన్ల కదలికలు కనిపిస్తుండటంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీ మీటింగ్స్ నిర్వహించారు. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

News March 19, 2026

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ&రేటింగ్

image

అవినీతి నాయకులు, వారికి సాయపడే టెర్రరిస్టులను హీరో ఎలా ఎదుర్కొన్నారనేదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టోరీ. మేనరిజమ్స్, డాన్సులు, నటనతో పవన్ వన్‌మ్యాన్ షో చేశారు. చిరు-పవన్ పాత సాంగ్స్ ఆకట్టుకుంటాయి. శ్రీలీల నటన బాగుంది. ఫ్యాన్స్ కోసం మాస్ ఎలివేషన్స్, డైలాగులతో డైరెక్టర్ హరీశ్ శంకర్ కథను నడిపించారు. ఔట్‌డేటెడ్ స్టోరీ, కొన్ని లాజిక్ లేని సీన్లు, BGM మైనస్. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
రేటింగ్: 2.5/5