News November 20, 2025
ఎట్టకేలకు బదిలీలు.. వరుస వివాదాల నేపథ్యంలో చర్యలు!

వేములవాడ రాజన్న ఆలయంలో ఎట్టకేలకు ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేపట్టారు. ఓ ఉద్యోగి అక్రమంగా సరకులు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపి చర్య తీసుకోవడానికి బదులుగా మీడియాపై ఎదురుదాడికి దిగడం, వార్తల కవరేజీకి సహకరించకపోవడం పట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. BJP ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించింది. నేడు ధర్నా ప్రకటించడంతో దిగివచ్చిన ఆలయ అధికారులు అంతర్గత బదిలీలు చేపట్టారు.
Similar News
News November 20, 2025
HYD: రాహుల్ ద్రవిడ్‌తో ఫ్రీడం ఆయిల్ ‘కోచింగ్ ది కోచ్’

ప్రముఖ వంట నూనె బ్రాండ్లలో ఒకటైన ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో రాహుల్ ద్రవిడ్ ప్రముఖంగా కనిపిస్తారని ఆ సంస్థ తెలిపింది. DRS (డిసీషన్ రివ్యూ సిస్టమ్) VS PRS (ప్యాక్ రివ్యూ సిస్టమ్)తో ప్రచారం చేయనుంది. ఈ భావనను ఉపయోగించి తమ కొత్త ‘కోచింగ్ ది కోచ్’ ప్రచారాన్ని ప్రారంభించింది. వినియోగదారులకు లీటర్ ఆయిల్ ప్యాకెట్ 910గ్రా. బరువుండాలని అవగాహన కల్పించనుంది.
News November 20, 2025
గింజ కోసం మొక్కజొన్న సాగు.. కోత సమయం ఇలా గుర్తించాలి

గింజ కోసం సాగు చేసే మొక్కజొన్న కోత సమయాన్ని కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. కండెల పైపొరలు ఎండినట్లు పసుపు వర్ణంలో కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కల నుంచి కిందకు వేలాడుతూ కనిపిస్తాయి. కండెలలోని గింజలను వేలిగోరుతో నొక్కినప్పుడు గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. కండెలోని గింజలను వేరుచేసి వాటి అడుగు భాగం పరీక్షిస్తే (కొన్ని రకాలలో) నల్లని చారలు కనిపిస్తాయి. ఈ సమయంలో పంట కోస్తే మంచి దిగుబడి వస్తుంది.
News November 20, 2025
జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు: ములుగు ఎస్పీ

జిల్లాలోని జర్నలిస్టులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శబరిష్ తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఒక్క టీం చొప్పున వివరాలను అందజేయాలని ఎస్పీ సూచించారు. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో పోటీలు నిర్వహించబడతాయని అన్నారు. వివరాలకు స్థానిక ఎస్హెచ్ఓలను సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.


