News November 20, 2025

షుగర్ కేసులు.. దేశంలోనే హైదరాబాద్ నం.4

image

దేశంలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు అధికంగా ఉన్న నగరాల్లో HYD 4వ స్థానంలో నిలిచింది. జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం తగ్గడం, జంక్‌ఫుడ్, అధికంగా కార్బ్స్ తీసుకోవడం దీనికి ప్రధాన కారణాలని వైద్యులు తెలిపారు. గొంతు తడారడం, తరచూ మూత్ర విసర్జన, శరీర బరువు తగ్గటం, అలసటగా ఉంటే అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Similar News

News November 21, 2025

హైదరాబాద్ RRR రీ సర్వే తప్పనిసరి: కవిత

image

రంగారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాటలో కవిత పర్యటన సాగుతుంది. RRR భూసేకరణలో అక్రమాలు జరిగాయని, రీ–సర్వే తప్పనిసరి అని ఆమె డిమాండ్ చేశారు. చెరువుల కబ్జాలు, ఆర్ఆర్ఆర్ ఆలైన్‌మెంట్ మార్పుల పెద్దల కోసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఒక్క న్యాయం పెద్దలకు మరో న్యాయమా? అంటూ కవిత నిలదీశారు.

News November 21, 2025

HYD: నాగోల్‌లో విషాదం.. దంపతుల సూసైడ్

image

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్‌లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.