News November 20, 2025

NZB: నకిలీ పత్రాలు సృష్టించి ప్రొఫెసర్‌కు రూ.47 లక్షలు కూచ్చుటోపి

image

నిజామాబాద్‌లో లేని భూమి ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి ఓ ప్రొఫెసర్‌కు రూ.47 లక్షల కుచ్చుటోపి పెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినాయక నగర్‌కు చెందిన ప్రొఫెసర్ కనకయ్యకు ఎకరం భూమి కొనిస్తామని చెప్పి చిలుక సాయిలు, షేక్ అహ్మద్ నబీ, బండి రవి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రూ.47 లక్షలు తీసుకున్నారు. తీరా మోసపోయనాని భావించి 4వ టౌన్‌లో ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Similar News

News November 23, 2025

వాన్‌ Vs వసీం.. ఈసారి షారుఖ్ మూవీ పోస్టర్‌తో!

image

యాషెస్ తొలి టెస్టులో ENG ఓటమితో ఆ జట్టు మాజీ క్రికెటర్‌ మైఖేల్ వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేశారు. మ్యాచ్ 2వ రోజు ENG ఆధిపత్యం చెలాయిస్తుందని వాన్ చెప్పారు. కానీ హెడ్ చెలరేగడంతో AUS గెలిచింది. దీంతో వసీం ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ ఫొటో పోస్ట్ చేసి ‘Hope you’re okay @michaelvaughan’ అని పేర్కొన్నారు. గతంలోనూ IND, ENG మ్యాచుల సందర్భంలో పుష్ప, జవాన్ మీమ్స్‌తో వసీం ట్రోల్ చేశారు.

News November 23, 2025

పిల్లల్లో ఆటిజం ఉందా? ఇలా చేయండి

image

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.

News November 23, 2025

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు 1100 కాల్ సెంటర్‌ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.