News November 20, 2025

ముప్కాల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శివానందం తెలిపారు. ముప్కాల్ గ్రామానికి చెందిన పన్నీర్ వెంకటేష్(24) ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.

Similar News

News March 5, 2026

నిజామాబాద్: ముగ్గురికి జైలు.. 26 మందికి భారీ జరిమానా!

image

నిజామాబాద్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన 29 మందికి కోర్టు భారీ జరిమానా, జైలు శిక్ష విధించింది. తనిఖీల్లో పట్టుబడిన వారిని ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిలో 26 మందికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షల జరిమానా విధించారు. పులాంగ్‌కు చెందిన యాదగిరి, గూపన్‌పల్లికి చెందిన రాజేశ్వర్, ఒడ్డట్‌పల్లికి చెందిన నవీన్ కుమార్‌లకు వారం రోజుల జైలు శిక్ష పడింది.

News March 5, 2026

NZB: ఈ మండలాలకు రిపోర్టర్లు కావలెను

image

ఆర్మూర్, ఆలూరు, నందిపేట, డొంకేశ్వర్, మాక్లూర్, జక్రాన్‌పల్లి, ముప్కాల్, మెండోరా, మోర్తాడ్, ఇందల్వాయి, డిచ్‌పల్లి, రెంజల్, కోటగిరి మండలాలకు Way2Newsలో పని చేసేందుకు అనుభవం కలిగిన రిపోర్టర్లు కావలెను. ఆసక్తి గల వారు <>లింకును క్లిక్ చేసి<<>> నమోదు చేసుకోండి.

News March 5, 2026

నిజామాబాద్: భక్తుల ముంగిటకే భద్రాద్రి తలంబ్రాలు

image

శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి రాములవారి కళ్యాణ తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భక్తుల ఇంటికే చేరవేస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. భక్తులు రూ.151 చెల్లించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటి వద్దకే తలంబ్రాలు అందజేస్తామన్నారు. ఉమ్మడి జిల్లా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.