News November 20, 2025

హిడ్మా అనుచరుడికి 14 రోజుల రిమాండ్: రావులపాలెం CI

image

మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్‌ను రావులపాలెంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు. సరోజ్.. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత వచ్చారా? లేక ముందే ఇక్కడ తలదాచుకున్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సరోజ్‌ను కొత్తపేట కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అతడిని RJY జైలుకు తరలించారు.

Similar News

News March 16, 2026

KU డిగ్రీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఏప్రిల్-2026 సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. BA, B.Com, B.Sc, BBA, BCA, B.Voc, BHM & CT తదితర కోర్సుల II, IV, VI సెమిస్టర్(రెగ్యులర్/బ్యాక్‌లాగ్) అలాగే I, III, V సెమిస్టర్ బ్యాక్‌లాగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 4 వరకు, రూ.50 లేట్ ఫీజుతో ఏప్రిల్ 9 వరకు తమ తమ కళాశాలల్లో చెల్లించాలి.

News March 16, 2026

ప.గో: మొదటి పరీక్షకు 371 గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని ప.గో డీఈఓ నారాయణ తెలిపారు. సోమవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు 23,415 మంది విద్యార్థులు గాను 23,044 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. 371 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని వెల్లడించారు.

News March 16, 2026

HYD: రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

image

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు HYD కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
# SHARE IT