News November 20, 2025
HYD: ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా 5 రోజులకు అనుమతి ఇచ్చింది. రవిని నేడు చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.
Similar News
News March 20, 2026
VZM: అయినాడ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం

VZM జిల్లా డెంకాడ మండలం అయినాడ కూడలి వద్ద గురువారం రాత్రి విజయనగరం నుంచి విశాఖ వెళ్తున్న కారు, రోడ్డు దాటుతున్న వ్యక్తిని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ వ్యక్తిని హుటాహుటిన విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతని వివరాలు తెలిసిన వారు 9121109446ను సంప్రదించాలని డెంకాడ పోలీసులు తెలిపారు.
News March 20, 2026
జాబ్ క్యాలెండర్ తమ చిత్తశుద్ధికి నిదర్శనం: అనగాని

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం అన్నారు. 22 నెలల్లోనే 6.5 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లో విద్య, పోలీసు శాఖలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. లోకేశ్ కృషితో విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయని, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా 25 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
News March 20, 2026
బంగారుపాళ్యం: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బంగారుపాళ్యంలో జరిగింది. పాపానివారి పల్లె కోళ్ల ఫారంలో బిహార్‌కు చెందిన లితీశ్ కుమార్ పనిచేస్తున్నాడు. కోళ్ల ఫారం యజమాని ప్రభుతో కలిసి బైకుపై కేజీ సత్రానికి బయలుదేరారు. వీరి వాహనాన్ని మరో బైక్ ఢీకొనడంతో లితీశ్ కుమార్ జాతీయ రహదారిపై పడ్డాడు. అటువైపు వెళుతున్న ట్యాంకర్ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.


