News November 20, 2025

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు అధికారుల వెల్లడించారు. బీబీపేట్ 8.9°C, గాంధారి 9.9, మేనూరు, లచ్చపేట, నస్రుల్లాబాద్ 10, రామారెడ్డి, రామలక్ష్మణపల్లి, డోంగ్లి 10.1, జుక్కల్, బొమ్మన్ దేవిపల్లి 10.2, సర్వాపూర్ 10.3, నాగిరెడ్డిపేట, బిచ్కుంద, బీర్కూర్ 10.5, లింగంపేట 10.8°C నమోదైంది.

Similar News

News April 6, 2026

జోగిపేట: ఈట్‌ రైట్ మేళాలో పాల్గొన్న మంత్రి దామోదర

image

ఓ హాస్పిటల్‌‌లో నిర్వహించిన ఈట్‌ రైట్-స్టే హెల్తీ మేళాలో సోమవారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఈట్ రైట్ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో పలువురు ఫుడ్ వెంటర్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మిల్లెట్లతో తయారు చేసిన ఆహార పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

News April 6, 2026

అలర్ట్: రోజుకో టైమ్‌కు పడుకుంటున్నారా?

image

రోజుకో సమయానికి పడుకోవడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతిని BP, హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని 3,000 మందిపై జరిపిన స్టడీ తేల్చింది. 7-8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో ఈ ముప్పు అధికమని హెచ్చరించింది. ఉదయం నిద్రలేచే సమయం కంటే రాత్రి పడుకునే టైమ్‌ స్థిరంగా ఉంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని స్పష్టం చేసింది.

News April 6, 2026

బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయానికి 49 అర్జీలు

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 49 అర్జీలు అందాయి. ఎస్పీ ఉమామహేశ్వర్ బాధితుల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.