News April 15, 2024
HYD: వివాహేతర సంబంధం.. DSP ఇంటి ముందు ఆందోళన
ఆదిభట్ల PS పరిధి తుర్కయంజాల్ శ్రీ సాయిపంచవతి హోమ్స్‌లోని DSP రంగా నాయక్ ఇంటి ముందు ఆయన భార్య ఆందోళనకు దిగారు. వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని జ్యోతి ఆరోపిస్తున్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నారు. కాగా, రంగా నాయక్ ప్రస్తుతం మెదక్ ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News January 30, 2025
HYD: ప్యాలెస్ CM KCR.. ప్రజల CM రేవంతన్న: సామ
‘ప్యాలెస్ CM KCR.. ప్రజల CM రేవంతన్న అని TGలో ఏ గల్లీలో తిరిగే చిన్న పోరణ్ని అడిగినా చెబుతాడు.. ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టింది ఎవరో.. గడీల పాలన చేసింది ఎవరో ప్రజలకు తెలుసు.. ప్యాలెస్ CM అని హరీశ్‌రావు రేవంతన్నను అనడం విడ్డూరం.. ఆయన పనితీరు చూసి BRS వాళ్లకు కడుపు మంట.. అహంకారంతో ఉన్న BRS గురించి ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోండి..’ అని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి నేడు ఫైరయ్యారు.
News January 30, 2025
HYD: మహాత్మా గాంధీకి నివాళులర్పించిన సీపీ
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ జోయల్ డేవిస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News January 30, 2025
రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా
రంగారెడ్డి జిల్లా కనిష్ట ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. అత్యల్పంగా చందనవెల్లిలో 11.4℃, రాచలూరు 11.7, ఎలిమినేడు 11.8, రెడ్డిపల్లె 12.3, తొమ్మిదిరేకుల 12.6, మీర్ఖాన్పేట 12.8, రాజేంద్రనగర్ 12.8, వెల్జాల 13.2, తాళ్లపల్లి 13.3, మంగళపల్లె 13.4, కందవాడ 13.6, దండుమైలారం 13.6, వైట్‌గోల్డ్ SS 13.6, కేతిరెడ్డిపల్లి 13.7, యాచారం 13.7, నల్లవెల్లి 13.8, విమానాశ్రయం 14, మొగలిగిద్ద 14.1, కేశంపేటలో 14.2℃గా నమోదైంది.