News November 20, 2025

నేడే ఫెస్ట్.. HYD వస్తున్న ఉత్తర, తూర్పు భారత ప్రజలు

image

ఉత్తర, తూర్పు భారతదేశ నలు మూలల నుంచి గౌరవనీయ ప్రతినిధులు తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో, కల్చరల్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు HYD చేరుకుంటున్నారు. రాజ్‌భవన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ విశిష్టోత్సవం నేడు ప్రారంభం కానుంది. సాంకేతికతతో పాటు సంస్కృతిని కలగలిపే ఈ వేడుకలో తాజా అప్డేట్స్‌ కోసం వేచి ఉండండి.

Similar News

News November 20, 2025

ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు: సజ్జనార్

image

TG: పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఉద్యోగులను బెదిరించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుందని ప్రకటన జారీ చేశారు.

News November 20, 2025

వజ్రోత్సవం వేళ.. JNTUపై వరాలు కురిపించేనా?

image

జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించేంచనున్నారు. 21న వజ్రోత్సవం, 22న పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగనుంది. మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం కళాశాలకు ఏమైనా వరాలు ప్రకటిస్తారా? అని అధ్యాపకులు, విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎం రాకతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.