News November 20, 2025

వేములవాడ: డ్రైనేజీలో పడి యువకుడి మృతి

image

వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డు ప్రాంతంలోని బతుకమ్మ తెప్ప వద్ద గల ప్రధాన డ్రైనేజీలో పడిపోయి ఓ యువకుడు మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి అనంతరం ద్విచక్రవాహనం అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున డ్రైనేజీలో ద్విచక్ర వాహనాన్ని, యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతి చెందిన యువకుడు స్థానిక బద్ది పోచమ్మ ఆలయంలో తాత్కాలిక పద్ధతిన పని చేస్తాడని తెలుస్తోంది.

Similar News

News March 12, 2026

మోనాలిసా పెళ్లిపై డైరెక్టర్ సంచలన కామెంట్స్

image

కుంభమేళా వైరల్ బ్యూటీ <<19356893>>మోనాలిసా<<>> పెళ్లిపై ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆ అమ్మాయిని నేను గంగామాత అవతారంగా భావిస్తాను. ఆమెతో సినిమా కోసం నేను రూ.10 కోట్లు లోన్ తీసుకున్నాను. జైలుకు కూడా వెళ్లాను. కానీ ఇప్పుడు ఓ ముస్లింతో పారిపోయింది. మొత్తం నాశనం చేసింది. ఇది తిరుగుబాటు కాదు. లవ్ జిహాద్. జైలు బయట వాళ్ల నాన్న ఏడ్చినా ఆమె పట్టించుకోలేదు’ అని తెలిపారు.

News March 12, 2026

NLG: నిప్పుల కొలిమిలా ఎండలు

image

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. మార్చి మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ఉదయం 10 గంటలకే బయట అడుగు పెట్టాలంటే జనం జంకుతున్నారు. జిల్లాలో బుధవారం గరిష్ఠంగా గుడిపల్లిలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. పెద్దవూరలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News March 12, 2026

భద్రాద్రి: విద్యార్థులు.. మన పంట.. మన భోజనం

image

అశ్వాపురం మండలం మిట్టగూడెంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి కళాశాల ప్రాంగణంలో ఆకుకూరలు, కూరగాయల తోటలను పెంచుతున్నారు. ఇక్కడ పండించిన తాజా కూరగాయలనే హాస్టల్ మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో శ్రమ విలువను పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ప్రిన్సిపల్ బి.రవి తెలిపారు. విద్యార్థుల ఈ చొరవను పలువురు అభినందిస్తున్నారు.