News November 20, 2025

ఎన్టీఆర్: పత్తి రైతులపై సీసీఐ నిర్లక్ష్యం

image

ఎన్టీఆర్ జిల్లాలో సీసీఐ ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఏ కేంద్రంలోనూ కొనుగోలు జరగక రైతులు ఆందోళన చెందుతున్నారు. కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, ఏ.కొండూరు, గంపలగూడెంలో కేంద్రాలు ఉన్నప్పటికీ అధికారులు పత్తి తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.7,710 – 8,110గా ఉన్నా దళారుల చేత తక్కువకు కొనిపించి లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Similar News

News March 18, 2026

VZM: ఎస్పీని కలిసిన ఉగాది పురస్కార గ్రహీతలు

image

ఉగాది-2026 సందర్భంగా సేవా పతకాలు పొందిన జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీ దామోదర్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని అభినందించి, ఇదే స్ఫూర్తితో బాధ్యతగా పని చేయాలని సూచించారు. కాగా జిల్లాలో మొత్తం 8 మందికి పతకాలు మంజూరయ్యాయి. వీటిలో ఒకటి ఉత్తమ సేవా పతకం, 7 సేవా పతకాలు ఉన్నాయి.

News March 18, 2026

పోలవరం నిర్వాసితులకు రూ.250 కోట్ల విడుదల

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ నిర్వాసితుల కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ నిధుల చెక్కును అందుకున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

News March 18, 2026

లవ్ ఫెయిల్.. మాచర్లలో యువతి సూసైడ్

image

ప్రేమ విఫలం కావడంతో యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన <<19358568>>మాచర్లలో<<>> బుధవారం వెలుగు చూసింది. పట్టణానికి చెందిన యువతి యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న కారణంతో ఇటీవల యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 4 రోజుల క్రితం తల్లిదండ్రులకు యువతిని అప్పగించారు.ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.