News November 20, 2025
ములుగు: అంబేడ్కరా.. చలి నుంచి రక్షించు!

ములుగు జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. అటవీ ప్రాంతంలో చలి తీవ్రత పెరగడంతో మనుషులతో పాటు జంతువులు విలవిల్లాడుతున్నాయి. ఈ క్రమంలో ఏటూరునాగారంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు ఓ కోతుల గుంపు కూర్చొని చలికి వణుకుతోంది. ‘అంబేడ్కరా.. చలి నుంచి మమ్మల్ని కాపాడు’ అని విగ్రహం వద్ద కూర్చొని వేడుకున్నట్లు ఉన్న ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్ ఫోన్లలో బంధించారు.
Similar News
News March 23, 2026
అత్యంత భద్రతతో నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి చేస్తాం: ఆదిత్య మిట్టల్

నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ప్లాంట్ సీఈవో ఆదిత్య మిట్టల్ తెలిపారు. అత్యంత భద్రతతో నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. తమకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
News March 23, 2026
కానాయపల్లిలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత

వనపర్తి జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గత 24 గంటల్లో జిల్లాలోని 21 కేంద్రాల్లో నమోదైన వివరాల ప్రకారం.. అత్యధికంగా కానాయపల్లిలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెలుగొండ, మదనపూర్ ప్రాంతాల్లో 38.7 డిగ్రీలుగా ఉండగా, వనపర్తి, పెబ్బేరులో 37.0 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 23, 2026
గుంటూరు: వచ్చేనెల 15 నుంచి ‘SIR’.. సక్రమంగా జరిగేనా..?

వచ్చే నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా SIR (స్పెషల్ ఇంటెన్షవ్ రివిజన్) నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పనకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది. SIRను ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడులో చేపట్టగా లక్షలాది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో APలో SIR చేపట్టనున్నాన్నారు. దీనికి ఇక్కడ ఎన్ని ప్రతిబంధకాలు ఎదురవుతాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.


