News November 20, 2025

టీయూ: వ్యవసాయ కళాశాలలో 30 అడ్మిషన్లు

image

టీయూకు కొత్తగా మంజూరైన వ్యవసాయ కళాశాలలో మొదటి సంవత్సరంలో 30 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. సౌకర్యాల లేమి కారణంగా హైదరాబాద్ వ్యవసాయ వర్సిటీలోనే మొదటి సెమిస్టర్ తరగతులు అక్కడే నిర్వహించనున్నారు. టీయూలో భవనాలు అందుబాటులో లేనందున సౌకర్యాల కల్పనకు టీయూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు వ్యవసాయ విద్య చేరువ కానుంది.

Similar News

News November 20, 2025

మేడ్చల్: ఘనంగా బాలల వారోత్సవాలు

image

అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు సరిత, రాధిక గుప్తా పాల్గొని పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. గౌరవంతో జీవించడం, విద్యను పొందడం, రక్షణ పొందడం ప్రాథమిక హక్కులని, ప్రతి చిన్నారి ఆత్మవిశ్వాసం, ఆనందం, సమానత్వం కలిగి ఉండాలన్నారు.

News November 20, 2025

GHMC స్టాండింగ్ కమిటీ మీటింగ్.. మూసాపేట్ కార్పొరేటర్ ARREST

image

GHMC స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. మూసాపేట్ డివిజన్‌కి రావాల్సిన నిధుల విషయంలో జాప్యం చేస్తున్నారని, డివిజన్‌లో మౌలిక సదుపాయాల కొరతపై అధికారులను నిలదీసినందుకు తనను అరెస్ట్ చేశారని మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ తెలిపారు. డివిజన్‌లో సమస్యలు పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు.

News November 20, 2025

జగిత్యాల: నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలి: కలెక్టర్

image

మల్లాపూర్ మండలం రాఘవపేట, ఓబులాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ధాన్యం తూకం, తేమశాతం, రసీదుల జారీ వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా కొనుగోళ్లు జరగాలని ఆయన ఆదేశించారు. అధికారులు నిరంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తూ సెంటర్ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లు జరిగే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. RDO, DCO, MRO పాల్గొన్నారు.