News November 20, 2025

MBNR: U-17, 19.. రేపు సాఫ్ట్ బాల్ ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల బాలికలకు సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలను ఈనెల 21న మహబూబ్‌నగర్‌లోని స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 20న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, సొంత గ్లాజ్‌లు తీసుకొని ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు 99592 20075, 99590 16610 సంప్రదించాలన్నారు.

Similar News

News November 20, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

“NGKL: అందెశ్రీకి మౌనం పాటించిన ఎంపీ మల్లు రవి
“NGKL: 100 ప్రభుత్వ పాఠశాలలకు గ్రీన్ బోర్డులు
“NGKL:ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
“BLMR: కొండనాగులలో మినీ స్టేడియం ఎమ్మెల్యే
“ACPT: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
“ACPT: 9 మంది పేకాట రయూలు అరెస్టు
కల్వకుర్తి: భవిత కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈవో

News November 20, 2025

పొగిడిన నోళ్లే తిడుతున్నాయ్.. కరెక్టేనా?

image

రాజమౌళి.. మొన్నటి వరకు తెలుగు సినీ కీర్తిని ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన వ్యక్తి. బాలీవుడ్‌ ఆధిపత్యాన్ని ఎదురించి సౌత్ సినిమాను దేశవ్యాప్తం చేసిన డైరెక్టర్. కానీ ఇప్పుడు.. ఆస్కార్ తెచ్చాడని పొగిడిన నోళ్లే నేలకు దించేస్తున్నాయి. ప్రశంసించిన వాళ్లే విమర్శిస్తున్నారు. ‘దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు’ అన్న ఒకేఒక్క మాట జక్కన్నను పాతాళానికి పడేసిందా? అంతరాత్మ ప్రభోదానుసారం మాట్లాడటం తప్పంటారా? COMMENT

News November 20, 2025

ములుగు: ‘స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి’

image

గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి, వ్యాపారాలపై దృష్టి సారించాలని జిల్లా పరిశ్రమల మేనేజర్ సిద్ధార్థ రెడ్డి సూచించారు. ములుగులో గురువారం PMEGP పథకాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సబ్సిడీల ద్వారా రుణాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీసీ మేనేజర్ విక్రమ్ చాత రాజు, అసిస్టెంట్ మేనేజర్ భూక్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.