News November 20, 2025

సిద్దిపేట: అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య

image

ప్రేమ వివాహం చేసుకున్న యువతి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అలిరాజిపేట బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 5 నెలల క్రితం గజ్వేల్ మండలం చిన్న ఆరేపల్లికి చెందిన యువతి సదా అఫ్రీన్ (21), అలిరాజపేట గ్రామానికి చెందిన ఫరీద్ (22) అనే యువకుడు ఇద్దరు డిగ్రీ చదువుకున్న రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకుంన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 23, 2026

హౌరా ఎక్స్‌ప్రెస్ కింద పడి స్నేహితుల సూసైడ్

image

తడ మండలం కొండూరు సమీపంలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతులను పిండిపాలెంకు చెందిన దమ్మకళ్యాణ్ (23), పేర్నాడుకు చెందిన జెడ్డా సునీల్ (25)గా గుర్తించారు. వీరు హౌరా ఎక్స్‌ప్రెస్ కింద పడినట్లు తెలుస్తోంది. లోకో పైలట్ సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

News March 23, 2026

రాజధాని డిజైన్లకే రూ.401 కోట్లా: YCP

image

AP: అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాల డిజైన్ల పేరిట CBN, ఆయన బినామీలు రూ.కోట్లు కొట్టేస్తున్నారని YCP ఆరోపించింది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి డిజైన్లు గీసి ఇవ్వడానికే దాదాపు రూ.401 CR ఖర్చు పెడుతున్నారని పేర్కొంది. 2016లో ఓ జపాన్ సంస్థకు, 2017లో జెనిసిస్ ప్లానర్స్‌కు రూ.113CRకు కాంట్రాక్టు ఇచ్చి రద్దు చేశారని తెలిపింది. 2024లో మళ్లీ జెనిసిస్‌కు రూ.137CRకు కాంట్రాక్టు ఇచ్చారని విమర్శించింది.

News March 23, 2026

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు వేగవంతం: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. శిల్పారామంలో మౌలిక వసతులు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. గుత్తి, కుందుర్పి కోటల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. అనంతసాగరం చెరువులో బోటింగ్ ప్రారంభించాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మరుగుదొడ్లు, సమాచారం బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.