News November 20, 2025

బిక్కనూర్: డిసెంబర్ 11న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్

image

డిసెంబర్ 11న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా కల్పిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

Similar News

News April 6, 2026

పాలకొల్లు: నైట్ యాక్సిడెంట్.. చికిత్స పొందుతూ హోమ్‌గార్డు మృతి

image

పాలకొల్లు మండలం ఉల్లంపర్రు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు <<19578295>>రఘుమండ వెంకటరమణ<<>>(56) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. పోడూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, ఆదివారం రాత్రి బైకుపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ను తొలుత పాలకొల్లు, అనంతరం భీమవరం అక్కడి నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News April 6, 2026

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం కుమారుడికి జీవితఖైదు

image

హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ చీఫ్ అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు జీవిత ఖైదు విధించింది. గతంలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. 2003, జూన్ 4న NCP నాయకుడు విద్యాచరణ్ శుక్లా సన్నిహితుడైన రామావతార్ జగ్గీని పట్టపగలు కాల్చి చంపారు. ఈ కేసులో అమిత్ సహా 31 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత పలువురికి కోర్టులో ఊరట లభించింది.

News April 6, 2026

త్వరలో సినిమాలకు త్రిష గుడ్‌బై?

image

TVK చీఫ్, హీరో విజయ్‌తో రిలేషన్‌పై రూమర్స్ నడుస్తున్న వేళ నటి త్రిష‌పై సినీవర్గాల్లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌పై చెప్పే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి. ప్రేమ గురించి ఆమె ఇటీవల <<19575762>>ఇన్‌స్టాలో<<>> షేర్ చేసిన పోస్ట్‌తో ఇది మొదలైంది. ఇక రీసెంట్‌గా ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పకపోవడంతో ఈ వదంతులకు బలం చేకూరింది. అయితే దీనిపై త్రిష స్పందించాల్సి ఉంది.