News November 20, 2025

రాజకీయ లబ్ధికోసం KTRపై అక్రమ కేసులు: హరీశ్

image

HYD బ్రాండ్ ఇమోజీని పెంచిన KTRపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న KTRపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధిపొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Similar News

News March 13, 2026

HYD: ఇంటిపై కూరగాయల సాగు నేర్చుకుంటారా?

image

జంటనగరాల్లో ఇంటి పైకప్పులు, బాల్కనీలో కూరగాయలు పెంచాలనుకునే వారికి ఉద్యానశాఖ శిక్షణ ఇవ్వనుంది. అర్బన్ ఫార్మింగ్ పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అర్బన్ ఫార్మింగ్ విభాగం సంచాలకులు రామలక్ష్మి తెలిపారు. ఈ శిక్షణ మార్చి 14న నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఉ.10 గంటల నుంచి మ.ఒంటి గంట వరకు జరుగుతుంది. వివరాలకు 8977714411 ఈ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
# SHARE IT

News March 13, 2026

HYD: శ్రీలంక టూర్‌కి కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టుకు అనుమతి

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టుకు శ్రీలంక పర్యటనకు అనుమతి లభించింది. తెలంగాణ జిల్లాల నుంచి ఎంపికైన యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం కల్పించడానికి ఈ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. టీమ్‌తె కోచ్ GS రాజు, మేనేజర్ వెంకటేశ్వరరావు, అబ్జర్వర్ శ్రీనివాస్ ఉంటారు. గ్రాస్‌రూట్ స్థాయిలో క్రికెట్ అభివృద్ధి చెందేలా చేయడం లక్ష్యం అంటున్నారు.

News March 13, 2026

HYD: ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సప్లై బంద్!

image

నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందుల బిల్లులు దాదాపు రూ.80 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ కాకపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. వెంటనే తమ బిల్లులు చెల్లించకపోతే మందుల సరఫరా పూర్తిగా నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.