News November 20, 2025

నాంపల్లి కోర్టులో ముగిసిన జగన్ విచారణ

image

HYD నాంపల్లి సీబీఐ కోర్టులో YCP అధినేత జగన్ విచారణ ముగిసింది. కోర్టులో ఆయన 5 నిమిషాలు మాత్రమే కూర్చున్నారు. వ్యక్తిగతంగా హాజరైనట్లు కోర్టు రికార్డులో నమోదు చేసింది. విచారణ అనంతరం ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చారు. కాసేపట్లో లోటస్ పాండ్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు. విదేశీ పర్యటన పిటిషన్‌కు సంబంధించి జగన్ కోర్టుకు హాజరయ్యారని, ఛార్జ్‌షీట్లకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదని ఆయన లాయర్ తెలిపారు.

Similar News

News November 22, 2025

రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

image

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్‌ను ఇస్తుందని సూచించారు. SHARE IT

News November 22, 2025

షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్‌లో శ్రద్ధా నటిస్తున్నారు.

News November 22, 2025

6 నెలల్లో అమరావతి రైతుల సమస్య పరిష్కారం: కమిటీ

image

AP: అమరావతి రైతుల స‌మ‌స్య‌ల‌ను 6నెలల్లోగా ప‌రిష్క‌రిస్తామ‌ని త్రీమెన్ క‌మిటీ హామీ ఇచ్చింది. 98% ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, ఇంకా 700 ఎకరాలపై సమస్య ఉందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పరిశీలన తర్వాత జరీబు, మెట్టభూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. లంకభూములపై గ్రీన్ ట్రిబ్యునల్‌ తీర్పు FEBలో వచ్చే అవకాశముందన్నారు. 719 మందికి మాత్రమే ఇంకా ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి నారాయణ చెప్పారు.