News November 20, 2025

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్ సత్యప్రసాద్

image

మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులను ఆయన ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు జాప్యం జరగకుండా చూడాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహశీల్దార్ రమేశ్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 24, 2026

మార్కాపురం నూతన కలెక్టర్ బాధ్యతలకు తాత్కాలిక బ్రేక్

image

అనివార్య కారణాల వలన బుధవారం మార్కాపురం నూతన జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాల్సిన విజయ సునీత జాయినింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి తెలియజేశారు. ముందుగా రేపు మార్కాపురం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపిన అధికారులు.. ఆమె జాయినింగ్ వాయిదా పడినట్లు వివరించారు. మళ్లీ బాధ్యతల స్వీకరణ ఎప్పుడు అనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు.

శ్రీకాకుళం: అమిత్ షాతో రామ్మోహన్ నాయుడు భేటీ

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం కేంద్ర మంత్రి, జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. శ్రీకాకుళం నగరంలోని నాగావళి పరివాహక ప్రాంతంలో రక్షణ గోడలు నిర్మించాలని కోరారు. జిల్లాలో పలుచోట్ల ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ ఆవశ్యకతను ఆయనకు వివరించారు. శ్రీకాకుళం మండలం పెద్దగనగళ్లవానిపేట వద్ద నాగావళి నది సముద్రంలో కలిసే చోట తీరం కోతకు గురౌతుందని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు.