News November 20, 2025
GHMC బర్త్, డెత్ సర్టిఫికెట్లు వాట్సాప్‌లోనే

మీసేవ వాట్సాప్ ద్వారా GHMC పరిధిలోని 30 సర్కిళ్లలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల వివరాలు అందుబాటులో ఉన్నట్లు ఉప్పల్ మీసేవ కేంద్ర అధికారులు తెలిపారు. డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి 2025 జూన్ రెండో తేదీ వరకు మరణించిన వారి వివరాలు మాత్రమే ఇందులో చూపిస్తున్నట్లుగా వినియోగదారులు తెలిపారు. ప్రజలు 80969 58096 నంబర్ సర్విస్‌ను వాట్సాప్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 16, 2026
విజయవాడలో అర్ధరాత్రి యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

విజయవాడలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నున్న డి మార్ట్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇరువురు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి పాయికాపురానికి చెందిన వాడిగా గుర్తించారు. మరో వ్యక్తి గాయపడగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News March 16, 2026
మార్చి 16: చరిత్రలో ఈరోజు

*1764: తెలుగు భాష తొలి నిఘంటు కర్త మామిడి వెంకటార్యులు జననం
*1901: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జననం
*1917 ఆంధ్రప్రదేశ్ మెుదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు జననం
*1963: భారత దేశ రెండో ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి మరణం
*జాతీయ టీకా దినోత్సవం
News March 16, 2026
మోపాల్: బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సినీ దర్శకుడు బలగం వేణు

మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి ఇందూరు తిరుమల క్షేత్ర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారికి చక్ర స్నానం, రథోత్సవం జరిపారు. సాయంత్రం పుష్ప యాగం నిర్వహించారు. ఈ వేడుకల్లో సినీ దర్శకుడు, నటుడు బలగం వేణు, సినీ నిర్మాత దిల్ రాజు, శిరీశ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవనాథ జీయర్ స్వామి ప్రవచించారు.


