News November 20, 2025
KMR: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: DTU

సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు TET నుంచి మినహాయింపు ఇవ్వాలని ధర్మా టీచర్స్ యూనిటీ (DTU) కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కోరారు. గురువారం కామారెడ్డిలో వారు సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, డీఏ తక్షణమే చెల్లించాలన్నారు. గత సంవత్సరం ఉపాధ్యాయులు నిర్వహించిన కులగణన రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరారు.
Similar News
News April 2, 2026
గ్రామ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
News April 2, 2026
శోకసంద్రమైన బోడ మాణిక్యం తండా!

హైదరాబాద్‌లో తల్లి స్రవంతి తన ఇద్దరు చిన్నారులకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. తల్లి స్రవంతి, చిన్నారుల మృతదేహాలు బోడ మాణిక్యం తండాకు బుధవారం చేరుకున్నాయి. పార్థివ దేహాలను చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండా మొత్తం దుఃఖసంద్రంగా మారి ఆర్తనాదాలతో మార్మోగింది. ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమవుతోంది.
News April 2, 2026
KNR: అనాథలకు డిప్లొమా కోర్సుల్లో 70% సీట్లు

తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026-27కు అనాథ విద్యార్థులకు పాలిటెక్నిక్‌లలో ఉచిత ప్రవేశాల దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. సివిల్, ఈఈఈ, కంప్యూటర్, ఈసీఈ కోర్సుల్లో సీట్లను మే 25లోపు కరీంనగర్ బాల రక్షా భవన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) ఫోన్ నంబర్ 7396424387 ను సంప్రదించాలని తెలిపారు.


