News November 20, 2025

24 నుంచి కడప జిల్లాలో YS జగన్ పర్యటన.?

image

ఈనెల 24 నుంచి 3 రోజులపాటు కడప జిల్లాలో YS జగన్ పర్యటిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు జిల్లాలో పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సోమవారం, మంగళవారం, బుధవారం ఆయన పులివెందులతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని, జగన్ పర్యటన వివరాలు అధికారికంగా రావాల్సి ఉందని YCP నాయకులు పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

నిర్మల్: ఈ నెల 16న ప్రజావాణి రద్దు

image

జనాభా గణన నేపథ్యంలో ఈ నెల 16న కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించబడడం లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

News March 13, 2026

అనకాపల్లి: 124 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ సెకండ్‌ ఇయర్ పరీక్షకు 124 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు శుక్రవారం తెలిపారు. మొత్తం 8,888 మంది హాజరు కావలసి ఉండగా 8,764 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరుగుతున్నట్లు తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

News March 13, 2026

NZB: ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష

image

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ శుక్రవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 15 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ 1.50 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.