News November 20, 2025
TTD అధికారులకు సవాలే..!

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు జరగనుంది. గత దర్శనాల సమయంలో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందు 3రోజులు ఆన్‌లైన్ టోకెన్లు ఉన్నవారినే అనుమతించనుంది. తర్వాత 7రోజులు ఎవరైనా వెళ్లవచ్చు. ఇవేమీ తెలియకుండా కొండకు భారీగా వచ్చే భక్తులను అదుపు చేయడం TTD అధికారులకు పెద్ద సవాల్‌గా మారనుంది.
Similar News
News March 15, 2026
కామారెడ్డి: ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణలో మార్పులు

కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ విధానంలో మార్పులు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జనగణన-2027 శిక్షణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను కలెక్టరేట్‌లోని 25వ నంబర్ గదిలో స్వీకరించనున్నట్లు వివరించారు.
News March 15, 2026
కాణిపాకం: 17న అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 17న ఉదయం 10:30 గంటలకు అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పెంచల కిశోర్ తెలిపారు. యుద్ధ పరిస్థితులు, అవసరమైన సరుకుల సరఫరా, ప్రసాదానికి ఉపయోగించే గ్యాస్ సరఫరా సంబంధిత ఏర్పాట్లపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశానికి ధర్మకర్తల మండలి ఛైర్మెన్, సభ్యులు, అధికారులు హాజరుకావాలని వారు కోరారు.
News March 15, 2026
కామారెడ్డి: డిజిటల్ పద్ధతిలో జనగణన: అదనపు కలెక్టర్

2026-27 జనగణన దశ-1 గృహ జాబితా, గృహ గణన కార్యక్రమంపై జిల్లా స్థాయి అధికారులకు కలెక్టరేట్‌లో ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ పద్ధతిలో జనగణనను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ఈ శిక్షణా మార్చి 15 నుంచి 17 వరకు IDOC సమావేశ మందిరంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.


