News November 20, 2025

రూ.50లక్షలతో తీస్తే రూ.60కోట్లు వచ్చాయి!

image

కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు సినిమాను గెలిపిస్తారని గుజరాతీ ఫిల్మ్ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’తో మరోసారి రుజువైంది. కేవలం రూ.50లక్షలతో తీసిన ఈ సినిమా తొలుత తడబడినా.. కథపై మౌత్ టాక్ పెరిగి ఇప్పటికే రూ.60కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ‘లాలో’ అనే రిక్షా డ్రైవర్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని అంకిత్ సఖియా తెరకెక్కించగా కరణ్ జోషి ప్రధాన పాత్రలో నటించారు. ఈచిత్రం గత నెల 10న థియేటర్లలో విడుదలైంది.

Similar News

News March 12, 2026

చమురు సంక్షోభం.. సోలార్ స్టాక్స్‌కు జోష్

image

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడిచమురు, LPG కొరత సూచీలను డౌన్ చేస్తుంటే గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ మాత్రం దూసుకెళ్తున్నాయి. సోలార్, విండ్ ఎనర్జీ స్టాక్స్‌లో భారీగా కొనుగోళ్లు పెరిగాయి. NTPC గ్రీన్ ఎనర్జీ 13.8%, సోలెక్స్ ఎనర్జీ 13%, KPI గ్రీన్ ఎనర్జీ 11.8%, సాత్విక్ ఎనర్జీ 7.9% గెయిన్ అయ్యాయి. ఇక LPG కొరత స్విగ్గీ, జొమాటో షేర్లపై ప్రభావం చూపిస్తోంది. వారం రోజుల్లో స్విగ్గీ 4.46%, జొమాటో 7% డౌన్ అయ్యాయి.

News March 12, 2026

సబ్జా గింజలతో కురులకు బలం

image

సబ్జా గింజలు చర్మానికే కాదు జుట్టుకు కూడా మంచి పోషకాలు అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ గింజలలోని విటమిన్ కె, బీటా కెరోటిన్, ప్రొటీన్లు.. వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయని, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి కొందరికి పడకపోవచ్చు. కాబట్టి వాడే ముందు వ్యక్తిగత నిపుణులు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

News March 12, 2026

‘జన నాయగన్‌’కు చిక్కులు.. ఓటీటీ డీల్ రద్దు?

image

సెన్సార్ వివాదంతో <<19146694>>వాయిదా పడుతున్న<<>> ‘జన నాయగన్‌’ మూవీకి మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఓటీటీ డీల్‌ను అమెజాన్ ప్రైమ్ రద్దు చేసుకుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రూ.120 కోట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకోగా CBFC సర్టిఫికేషన్‌ విషయంలో వివాదాలు, చెప్పిన సమయానికి మూవీ విడుదల కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. కాగా ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం గత సంక్రాంతికి ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది.