News November 20, 2025
మెట్రో రైల్‌తో తంట.. నిలిచిపోయిన కీలక ప్రాజెక్టులు.?

విజయవాడ మెట్రో రైల్‌కు కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో నగర అభివృద్ధిలో కీలకమైన మహానాడు-నిడమానూరు, బెంజ్‌సర్కిల్-పెనమలూరు ఫ్లైఓవర్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. మెట్రో ఆమోదం లేకుండా NHAI ఫ్లైఓవర్లు నిర్మిస్తే భవిష్యత్‌లో వాటిని తొలగించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే మెట్రో-NHAI కలిసి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు ఏకకాలంలో చేపట్టాల్సిన అవసరం ఉంది.
Similar News
News March 13, 2026
వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు నేటి నుంచి కొత్త విధానం

TG: వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనుంది. నేటి నుంచి ఫిజికల్ పేపర్లు తీసుకోబోమని రవాణాశాఖ వెల్లడించింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ అయిన 7రోజుల్లోగా డీలర్లు వెహికల్ ఓనర్, ఫైనాన్షియర్ సంతకాలతో ఫామ్20, ఇతర పత్రాలు ఆన్‌లైన్‌లో సమర్పించాలని తెలిపింది. 2 పని దినాల్లో వాటిని ఆమోదించాలని అధికారులను ఆదేశించింది. నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
News March 13, 2026
అనకాపల్లి జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై నివేదిక

అనకాపల్లి జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన బొజ్జన్న కొండ, కొండకర్ల ఆవ, సముద్రతీర ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు కలెక్టర్ విజయ కృష్ణన్ నివేదికను అందజేశారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కలెక్టర్లకు ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
News March 13, 2026
ఉగాది కానుక.. నేడు అకౌంట్లలోకి రూ.6వేలు

పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా ఇవాళ PM మోదీ అస్సాం పర్యటనలో 22వ విడత నిధులు విడుదల చేయనున్నారు. 9.32Cr మంది ఖాతాల్లో ₹2K చొప్పున జమ చేస్తారు. అలాగే APలో ఉగాది కానుకగా PM KISANతోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM CBN కృష్ణా(D) గన్నవరంలో రిలీజ్ చేస్తారు. 46.85L మంది అకౌంట్లలో ₹6K చొప్పున(₹2K+₹4K) జమ చేస్తారు. ఈ జాబితాలో మీ పేరుందో లేదో <


