News April 15, 2024
మండపేటలో 1000 మందికి పైగా వాలంటీర్ల రాజీనామా

ఉమ్మడి తూ.గో జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు మండపేట నియోజకవర్గానికి చెందిన 1000 మందికి పైగా రాజీనామా చేశారు. వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు సమక్షంలో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైసీపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వారు స్పష్టం చేశారు. తోట త్రిమూర్తులుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధించిందన్నారు.
Similar News
News July 5, 2025
కొవ్వూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కొవ్వూరు రైల్వే స్టేషన్ శివారున గుర్తు తెలియని (35) ఏళ్ల వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్ఐ పి.అప్పారావు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల మధ్య సమయంలో రైలు నుంచి జారిపడి మరణించి ఉండొచ్చని ఎస్ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, వివరాల కోసం 9347237683 నంబర్‌ను సంప్రదించాల్సిందిగా కోరారు.
News July 5, 2025
ఇసుక అధిక లోడుతో వెళితే చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

ఇసుక అధిక లోడు వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఇసుక ర్యాంప్‌ల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం ర్యాంపు నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నిబంధనలు పాటించని ఏజెన్సీలకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండానే రద్దు చేస్తామని హెచ్చరించారు. వాహనాల లోడింగ్, పడిన ఇసుక తొలగింపు బాధ్యత ఏజెన్సీలదే అన్నారు.
News July 5, 2025
చేయూతను అందించడమే పీ4 లక్ష్యం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పీ4 కార్యక్రమంపై శుక్రవారం సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గ్రామాల్లో 10% మార్గదర్శులను, దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాలను ఎంచుకుని వారికి పీ4 ఉద్దేశ్యం వివరించాలన్నారు. దిగువ స్థాయి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక బాధ్యత కింద చేయూత అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.