News November 20, 2025
HYD: బాధితులకు అండగా సైబర్ పోలీసులు

డబ్బు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైం పోలీసులు అండగా నిలిచారు. ఫిర్యాదు స్వీకరించిన మరుక్షణం నుంచే స్పందించి సైబర్ నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి నుంచి రూ.63.23 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు 18 మంది నిందితులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
Similar News
News March 22, 2026
KMR: చారిత్రక నేపథ్యం ఉన్న కౌలాస్ కోటను మీరు చూశారా..!

KMR జిల్లాలో చారిత్రక నేపథ్యం కలిగిన జుక్కల్ మండలంలోని కౌలాస్ కోట ప్రాచుర్యం పొందింది. అటవీ ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య, కొండల నడుమ చూడ చక్కని పర్యాటక ప్రదేశంగా విరసిల్లుతోంది. కాకతీయుల నుంచి మొదలుకొని నిజాం పాలకుల వరకు ఈ కోటను వినియోగించుకున్నారు. కోట చుట్టూ కలిగిన ప్రకృతి సౌందర్య దృశ్యాలు, కోట లోపల దేవాలయాలు, దర్గాలు, పురాతన కట్టడాలు ఉన్నాయి. పలు ప్రాంతాల నుంచి విహారయాత్రకు ఇక్కడికి వస్తారు.
News March 22, 2026
బందరులో YCP ఫ్లెక్సీ చించివేత..!

బందరులోని 33వ డివిజన్ చింత చెట్టు సెంటర్‌లో ఏర్పాటు చేసిన YCP ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా వైసీపీ మాజీ కార్పొరేటర్ అజ్గర్ డివిజన్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దానిని గుర్తుతెలియని వ్యక్తులు చించి వేయడం పలు రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News March 22, 2026
రైతుల కోసం టెలీ-మానస్ హెల్ప్ లైన్ : ADB కలెక్టర్

మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రైతులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వం అందిస్తున్న టెలీ-మానస్ (Tele-MANAS) హెల్ప్‌లైన్ 14416 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ నంబర్‌కు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ సేవలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దన్నారు.


