News November 20, 2025

పల్నాటి వీరారాధనోత్సవాల్లో రాయబార ఘట్టం

image

పల్నాటి వీరాధనోత్సవాల్లో గురువారం రాయబార ఘట్టాన్ని నిర్వహించారు. సుమారు 7 సంవత్సరాలు 6 నెలలుగా అరణ్యవాసంలో ఉన్న మాచర్ల రాజ్యమంది తిరిగి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని బ్రహ్మన్న మళ్లీ దేవరాజులు అనుకునే సంఘటనగా ఆచారవంతులు ప్రతిబింబించగా, పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొణతాలతో (వీరుల ఆయుధాలు) గ్రామోత్సవం ఘనంగా జరిగింది.

Similar News

News March 10, 2026

ANU: ప్రవేశ పరీక్షా షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో MBA, MCA ఉమ్మడి ప్రవేశ పరీక్షా షెడ్యూల్‌ను మంగళవారం కో ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ విడుదల చేశారు. ఈ నెల 15న రాష్ట్రంలోని 12 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ www.anucde.info నుంచి హాల్ టికెట్లను పొందవచ్చన్నారు.

News March 10, 2026

BREAKING: 13న అకౌంట్లలో డబ్బులు జమ

image

రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేస్తారు. కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.

News March 10, 2026

ప్రజలపై భారం.. మీ విద్యుత్ కొనం: NTPCకి రాష్ట్రం లేఖ

image

TG: బయట చౌకగా దొరుకుతున్నా ఒప్పందం పేరిట ఎక్కువ ధర ఉన్న NTPC విద్యుత్తును కొనేది లేదని రాష్ట్రం ఆ సంస్థకు లేఖ రాసింది. తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. అటు సంస్థ నిర్మిస్తున్న 2400MW ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. నిల్వలు ఉంటే సరఫరాపై పరిశీలిస్తామంది. ప్రజలపై భారం పడకుండా తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వాలని స్పష్టం చేసింది.