News November 20, 2025
పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు: కలెక్టర్

పేదల ఆకలిని తీర్చేందుకే ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వహిస్తుందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా తెలిపారు. పటమట హైస్కూల్ రోడ్డులోని అన్న క్యాంటీన్ ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ.5 చెల్లించి, అక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఆయన అల్పాహారం స్వీకరించారు. ఆహారం పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. డైనింగ్ ఏరియా, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాల పట్టిక, తాగునీటిని సరఫరాను చేశారు.
Similar News
News March 14, 2026
జగిత్యాల: ‘దేశాన్ని ఏకం చేసేది మన సంస్కృతే’

కులం, మతం, భాష, వేషం ఏదైనా మన సంస్కృతి ఒకటేనని, భారతదేశాన్ని ఏకం చేసే మన భారతీయ సంస్కృతినీ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తెలంగాణ ప్రాంత కార్యకారిని సభ్యులు బూర్ల దక్షిణామూర్తి అన్నారు. ఆర్ఎస్ఎస్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉగాది ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ స్వయం సేవకులు పూర్ణ గనవేశతో నగరంలో పత సంచలనం నిర్వహించారు.
News March 14, 2026
సీసీకుంట: “వెయ్యేళ్ల కురుమూర్తి కొండలను కాపాడండి”

చిన్న చింతకుంట మండలం అమ్మపురం గ్రామంలో క్రషర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు జరిగితే పర్యావరణానికి, వ్యవసాయానికి, భక్తుల భావాలకు నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
News March 14, 2026
సూళ్లూరుపేటలో జువెలరీ షాపులో దోపిడి

సూళ్లూరుపేట పట్టణంలోని కచేరి వీధిలో ఉన్న వెంకటేశ్వర జువెలరీ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడి జరిగింది. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.45 లక్షల విలువైన 916 హాల్‌మార్క్ బంగారు నగలను అపహరించి పరారయ్యాడు. ఘటనతో ప్రాంతంలో కలకలం రేగగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.


