News November 20, 2025
గృహ నిర్మాణాల్లో ప్రజల సంతృప్తే గీటురాయి: కలెక్టర్

గృహ నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్‌లో గృహాల నిర్మాణంపై కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించుకోవడం ఒక కల అని, దానిని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. వివిధ స్థాయిలలో ఉన్న గృహా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.
Similar News
News March 10, 2026
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కోల్పోయిన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్లే

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం నెలకొంది. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో ఆయన కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఆయన తండ్రి అలీ ఖమేనీ, తల్లి మన్సూరే ఖోజస్తే మరణించగా తర్వాతి దాడుల్లో భార్య (జహ్రా హదాద్ అడెల్), ఒక కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఒక సోదరి, బావ, ఇద్దరు పిల్లలు సహా మొజ్తబా మొత్తం 8 మంది కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు సమాచారం.
News March 10, 2026
గద్వాల: MP బంధువులకు యాక్సిడెంట్

గద్వాల జిల్లా ఉండవెల్లి శివారులో ఈరోజు <<19343397>>రోడ్డు ప్రమాదం జరిగిన<<>> విషయం తెలిసిందే. AP కర్నూల్(D) పంచలింగాల వాసి మద్దిలేటి(70), ఆయన భార్య మన్నెమ్మ, కుమారుడు నాగరాజుతోపాటు మానవపాడు(M) పోతులగపాడు వాసి కృష్ణవేణి కలిసి ఉండవెల్లిలోని కంచుపాడులో జమ్ములమ్మ గుడికి వస్తున్నారు. మార్గమధ్యంలో బైక్‌ను తప్పించబోయి కారు చెట్టును ఢీకొట్టడంతో నలుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. కాగా మద్దిలేటి కర్నూల్ MP నాగరాజుకు చిన్నాన్న.
News March 10, 2026
దేశంలోనే 2nd రిచెస్ట్ MLAగా మాధవీరెడ్డి

మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోనే టాప్-10 రిచెస్ట్ మహిళా MLA, MPల లిస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో కడప MLA రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి రూ.388 కోట్లతో 2వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా కోవూరు MLA ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి రూ.291 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మొదటి 3 స్థానాల్లో AP ఎమ్మెల్యేలే ఉండటం విశేషం.


