News November 20, 2025

కైకలూరు: ప్యాసింజర్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

కైకలూరు సమీపంలో నర్సాపూర్ ప్యాసింజర్ రైలు ఢీకొని సుమారు 60 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి గురువారం మృతి చెందారు. మృతుడు తెలుపు రంగు టీషర్ట్, సిమెంట్ కలర్ ప్యాంట్ ధరించినట్లు భీమవరం రైల్వే జీఆర్‌పీ ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. వివరాలు తెలిసినవారు 9908448729 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.

Similar News

News April 2, 2026

ఇటలీకి హ్యాట్రిక్ షాక్!

image

ఫుట్‌బాల్ ప్రపంచకప్ హిస్టరీలో నాలుగుసార్లు (1932, 1938, 1982, 2006) ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీ ఇప్పుడు క్వాలిఫికేషన్‌కే తడబడుతోంది. 2018, 2022తో పాటు ఇప్పుడు లేటెస్ట్‌గా మరోసారి ఆ జట్టు అర్హతను సాధించలేకపోయింది. ప్రత్యర్థి బోస్నియాను తక్కువ అంచనా వేసిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇతర స్టార్ జట్లు చిలీ, పోలాండ్, నైజీరియా, కోస్టారికా కూడా అర్హత సాధించలేకపోయాయి. JUN 11 నుంచి WC ప్రారంభంకానుంది.

News April 2, 2026

కారు ఢీకొని ఇంజినీరింగ్ అసిస్టెంట్ మృతి

image

ఓర్వకల్లు మండలం కన్నమడకల సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రంగస్వామి (33) రోడ్డు ప్రమాదంలో మరణించారు. బుధవారం విధులు ముగించుకుని బైక్‌పై కర్నూలుకు వెళ్తుండగా ఎయిర్‌పోర్టు వద్ద కారు వెనక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయనను కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 2, 2026

KNR: రైతులకు వరంగా ‘పీఎం కుసుమ్’

image

సోలార్‌తో నడిచే వ్యవసాయ పంపుసెట్లను రైతులకు అందించేందుకు కేంద్రం ‘పీఎం కుసుమ్’ కాంపోనెంట్-సీ పథకం ద్వారా రూ.4 లక్షల విలువైన 7.5 కిలోవాట్ల సోలార్ యూనిట్‌ను 100% రాయితీతో అందిస్తుంది. ఈ మేరకు సోలార్ పలకలు, ఇన్వర్టర్లు, ఇతర పరికరాలను ఉచితంగా సమకూర్చుతారు. ఉమ్మడి KNR జిల్లాలో 97 మంది రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతం 121.7 కిలోవాట్ల సామర్థ్యం గల పరికరాల బిగింపు పనులు కొసాగుతున్నాయి.