News November 20, 2025

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో సీట్ల భర్తీ ఇలా..!

image

కొత్తగూడెం: మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో 2025-26 అకాడమిక్ సంవత్సరంలో క్లాసులు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డాక్టర్ టి.జగన్మోహన్ రాజు తెలిపారు. B.Tech CSC- 63, EEE -48, Mining -55, ECE -6, IT -1, B.Sc జియాలజీ -11, ఎన్విరాన్మెంట్ సైన్స్ -31, M.Sc ఎన్విరాన్మెంట్ సైన్స్ -11 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. డిసెంబర్‌లో సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు వే2న్యూస్‌తో చెప్పారు.

Similar News

News March 25, 2026

అమెరికా-ఇరాన్ మధ్య పాక్.. వ్యూహమా? స్వార్థమా?

image

US, ఇరాన్ మధ్య గొడవను ఆపేందుకు పాక్ ఇప్పుడు మధ్యవర్తిగా మారుతోంది. దీని వెనుక శాంతి కంటే స్వార్థమే ఎక్కువ కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాలేక గల్ఫ్ దేశాల సపోర్ట్ కోసం ఇలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఇండియా ఇన్‌ఫ్లుయెన్స్‌ను తగ్గించాలనే వ్యూహమూ కనిపిస్తోందంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డైరెక్షన్‌లో జరుగుతున్న ఈ టాక్టిక్స్‌కు ఇరాన్ ఇంకా ఓకే చెప్పలేదు.

News March 25, 2026

జగిత్యాల జిల్లాలో రాజకీయ నాయకుల ఆశలు..!

image

రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పెంపుపై కేంద్రప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఒకే జిల్లా పరిధిలో ఉండాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా జనాభా లెక్కల ప్రకారం తుది జాబితా రూపొందించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో 2 నుంచి 3 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనికోసం ఇప్పటి నుంచే ఆశావాహులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.