News November 20, 2025

సీ- ప్లేన్ సర్వీస్ ప్రాజెక్టుకు ప్రతిపాదన: కలెక్టర్

image

మలికిపురం మండలం దిండి నదీ తీరంలో నీటిపై ట్యాండ్ అయ్యే సీ- ప్లేన్ సర్వీసుల ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురంలో గురువారం కలెక్టర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదించిన తొమ్మిది ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టును దిండి నదీ తీరంలో చేపట్టనున్నట్లు చెప్పారు. రూ.20 కోట్లతో పనులు ప్రతిపాదించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ చెప్పారు.

Similar News

News April 3, 2026

గతంలో మాదిరి ఉంటామంటే కుదరదు: నిమ్మల

image

ఇరిగేషన్ అధికారుల తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్ అయ్యారు. APR, MAYలో చేపట్టాల్సిన పనులపై ప్రపోజల్స్ రూపొందించకపోవడం ఏమిటని వీడియో కాన్ఫరెన్సులో ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రంలోగా సమర్పించాలని, లేకుంటే స్వయంగా సంజాయిషీ ఇచ్చుకోవాలని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మాదిరే ఇంకా వ్యవహరిస్తామంటే కుదరదని, తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఎకరాకు నీరందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News April 3, 2026

భూ భారతి: రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్లీ నో ఛేంజ్

image

TG: ‘భూ భారతి’లో GOVT కొత్త రూల్ పెడుతోంది. భూ యజమాని ముందు ఇంటిగ్రేటెడ్‌ పోర్టల్లో భూ సర్వేకు దరఖాస్తు చేస్తే సరిహద్దు రైతులకు సర్వేయర్లు నోటీసులిస్తారు. వారి సమక్షంలో సర్వే చేసి తహసీల్దార్లకు రిపోర్టు ఇస్తారు. రెవెన్యూశాఖ ఇచ్చే సర్వేపటంతో భూ భారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు రైతు దరఖాస్తు చేసుకోవాలి. సర్వేలో తేలిన విస్తీర్ణానికే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. తరువాత మార్పునకు అవకాశం ఉండదు.

News April 3, 2026

రేపు ఆదిలాబాద్‌లో జాబ్ మేళా

image

ఆదిలాబాద్‌లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ఈనెల 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శివకృష్ణ తెలిపారు. పలు ప్రైవేటు కంపెనీలు పాల్గొని టెక్నికల్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెలికాలర్‌తో పాటు పలు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు.