News November 20, 2025
సంగారెడ్డి: నీటి సంరక్షణపై భవిష్యత్: అదనపు కలెక్టర్

నీటి సంరక్షణ మీదనే భవిష్యత్ ఆధారపడి ఉందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా వాటర్ హెడ్ NGO’s ఆధ్వర్యంలో నీటి సంరక్షణ సుస్థిరమైన నీటి భవిష్యత్ కోసం సంఘాలను సాధికారపరచడం కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన పది గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవో, ఎంపీడీవోలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసి ప్రారంభించారు.
Similar News
News April 2, 2026
గుడిబండ తహశీల్దార్ ఇంట్లో సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ తహశీల్దార్ శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి అక్రమ ఆస్తులను గుర్తించారు. తనిఖీల్లో రూ.55 లక్షల నగదు, 221 గ్రాముల బంగారం, 685 గ్రాముల వెండి, రూ.24 లక్షల బ్యాంకు డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పలు ఇళ్ల పత్రాలు కూడా లభించాయి. నిందితుడిని నేడు కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
News April 2, 2026
ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన…

ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణంలో పాల్గొనేందుకు కడప జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబు తన పర్యటనను ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రామయ్య కళ్యాణం ముగిసిన అనంతరం ఒంటిమిట్టలో ఆయన రాత్రి బస చేశారు. ఇవాళ ఉదయం ఒంటిమిట్టలోని హెలిపాడ్ వద్ద నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయనకు కలెక్టర్ శ్రీధర్, డీఐజీ కోయ ప్రవీణ్, ఇతర ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికారు.
News April 2, 2026
సిరిసిల్ల : ఇక నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ సర్వీసులు

సెస్ పరిధిలోని సర్వీసు మీటర్లు ఇది వరకు ఈ కింది విధంగా ఉన్నాయి. గృహాలు 174598, వాణిజ్య 22283, పరిశ్రమలు 1497, పవర్లుమ్ 3479, వ్యవసాయ 80888, స్ట్రీట్ లైట్స్ 1409, నీటి సరఫరా 1869, జనరల్ 1111, ఈవీ (హెచ్టి హైటెన్షన్) 1, హెచ్పీ దాటానివి 127 ఉండగా మొత్తం 287375 కనెక్షన్స్ ఉన్నాయి. ఈ సర్వీసులన్ని ఇక నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలో కొనసాగనున్నాయి. 3,86,000 మంది వినియోగదారులకు ఎన్పీడీసీఎల్ సేవలు అందించనుంది.


