News November 20, 2025
ANU దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టులో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ రామచంద్రన్ గురువారం విడుదల చేశారు. పీజీ కోర్సులకు రీవాల్యుయేషన్‌కు ప్రతి పేపర్‌కు రూ. 960 చొప్పున ఈ నెల 29లోగా ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు.
Similar News
News March 15, 2026
గుడా పాఠశాలను సందర్శించిన కలెక్టర్

హుకుంపేటలో గుడా GTWAH పాఠశాలను ఆదివారం కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు. రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఎస్.ఎస్.ఎస్ విద్యార్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. వారి పరీక్షల సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి “ఆల్ ది బెస్ట్” తెలియజేశారు.
News March 15, 2026
మరణం కాదు.. నరకం నుంచి విముక్తి!

<<19352489>>హరీశ్ రాణా<<>> కేసులో ‘పాసివ్ యుథనేషియా’కు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఇది నేరుగా ప్రాణం తీసే ప్రక్రియ కాదు. కోలుకునే అవకాశం లేని రోగికి కృత్రిమంగా అందిస్తున్న వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్ వంటి లైఫ్ సపోర్ట్‌ను నిలిపేస్తారు. దీనివల్ల బాధితుడు తన అనారోగ్యం కారణంగా సహజంగా మరణిస్తారు. వాళ్లు పడే నరకయాతనను ముగించి గౌరవప్రదమైన మరణాన్ని అందించడమే ఈ వైద్య ప్రక్రియ ఉద్దేశం.
News March 15, 2026
కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డిస్కౌంట్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు లేదా OTPలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.


