News November 20, 2025

HYD: సౌదీలో మృతదేహాలకు రేపు అంత్యక్రియలు: అజహరుద్దీన్

image

సౌదీలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి రేపు అంత్యక్రియలు చేయనున్నట్లు మైనారిటీ శాఖ మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సౌదీ అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మృతుల కుటుంబసభ్యులు సైతం సౌదీకి చేరుకున్నారు.

Similar News

News March 15, 2026

ALERT: HYDలో ఈ రూట్లలో వెళ్లొద్దు

image

HYDలో నేడు భారీ ఈవెంట్లు జరగనున్నాయి. యూసుఫ్‌గూడలో ‘<<19385959>>ఉస్తాద్ భగత్ సింగ్<<>>’ ప్రీరిలీజ్, LBస్టేడియంలో ‘ఇఫ్తార్’తో రోడ్లు క్లోజ్ అవ్వనున్నాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్↦ KVBR స్టేడియం↦ పంజాగుట్ట, మైత్రీవనం↦ కృష్ణానగర్ జంక్షన్↦ జూబ్లీహిల్స్, మాదాపూర్..
ఎల్బీస్టేడియం↦ ARపెట్రోల్ పంప్, బషీర్‌బాగ్, సుజాత స్కూల్ రోడ్లు క్లోజ్ అవుతాయి. లక్డికాపూల్, రవీంద్రభారతి, లిబర్టీ వద్ద రద్దీ ఉంటుందని పోలీసులు తెలిపారు.

News March 15, 2026

ఓటుకు నోటు.. అసెంబ్లీలో ఫైటు: అంతా తుస్సు!

image

‘కారు’ దిగి ‘చేయి’ వచ్చినా కాళేశ్వరం, మూసీ కూల్చివేతలపై సభ కుదిపేయనుంది. నిధుల కొరతతో సర్కార్, ఫిరాయింపులతో విపక్షం కత్తులు నూరుతున్నాయి. బయ్యారం ఉక్కు, గిరిజన వర్సిటీ కాగితాలకే పరిమితం కాగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రిపేర్ యూనిట్‌గా మారింది. కమలం విభజన హామీలని మర్చిపోగా పతంగి, కొత్త బీసీ పార్టీలు, ఎర్రజెండా అంతా ఓటు బ్యాంకు రాజకీయంలో మునిగారు. ఇందులో అమ్మడుపోయిన ఓటర్లూ బాధ్యులే. దీనిపై మీ కామెంట్?

News March 15, 2026

HYD: ఓ వైపు ఉస్తాద్.. మరో వైపు ఇఫ్తార్.. ఫుల్ జోష్

image

ఈ సండే సిటీ అంతా సందడిగా మారనుంది. ఓవైపు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో అభిమానుల కోలాహలం, మరోవైపు LBస్టేడియంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇఫ్తార్ విందు’తో వీఐపీల రాక, వీటికి తోడు రంజాన్ నెల చివరి ఆదివారం కావడంతో పాతబస్తీ నైట్ బజార్‌కు పోటెత్తనున్న జనం. ఇలా నగరం నలుమూలలా భారీ ఈవెంట్లతో హైదరాబాద్ నేడు ‘ఫుల్ జోష్’లో ఉండబోతోంది.