News November 20, 2025

నర్వ: యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై సమీక్షించిన నీతి ఆయోగ్ సీఈఓ

image

యాస్పిరేషన్ బ్లాక్ పరిధిలోని నర్వ మండలంలో సూచించబడిన వివిధ విభాగాల ప్రగతి పై గురువారం నీతి అయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. నీతి అయోగ్ సీఈఓ అధ్యక్షతన జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్ కుమార్, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 23, 2025

పత్తి రైతులకు తప్పని యాప్ కష్టాలు

image

పండించిన పంటను అమ్ముకోవడానికి ఇన్ని యాప్‌లలో నమోదుకు చేసుకోవాలా? అని కొందరు పత్తి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట వేశాక ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. లేకుంటే పంట కొనరు. పంట చేతికొచ్చాక అమ్మడానికి రైతుసేవా కేంద్రంలో సీఎం యాప్‌లో నమోదు చేసుకోవాలి. తర్వాత CCIకి చెందిన కపాస్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఈ మూడూ అనుసంధానమైతేనే పత్తిని రైతులు అమ్ముకోగలరు. ఈ విధానం రైతులకు ఇబ్బందిగా మారింది.

News November 23, 2025

పెదవులు నల్లగా మారాయా?

image

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, స్మోకింగ్ వంటి వాటివల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్​ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.

News November 23, 2025

కొత్తగూడెం: పశువుల అక్రమ రవాణా గుట్టు రట్టు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టపగలే పశువుల అక్రమ తరలింపు బహిర్గతమైంది. మణుగూరు నుంచి కొత్తగూడెం ప్రాంతానికి టాటా ఏసీ వాహనంలో 10కి పైగా ఆవులను ఇరుకుగా ఎక్కించి రవాణా చేస్తుండగా, లోడు ఎక్కువై అంబేడ్కర్ సెంటర్ వద్ద వాహనం ఆగిపోయింది. దీంతో అక్రమ రవాణా గుట్టు రట్టయింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, వివరాలు సేకరిస్తున్నారు.