News November 20, 2025
మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘సాగర్ కవచ్’ అనేది భారతీయ తీర రక్షక దళం, ఇతర భద్రతా సంస్థలు నిర్వహించే ఒక వార్షిక సముద్ర భద్రతా విన్యాసం. సముద్ర ముప్పులను ఎదుర్కోవడానికి తీర ప్రాంత భద్రతా సంసిద్ధతగా ఈ డ్రిల్ నిర్వహించారు. తీర ప్రాంతంలో తీవ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.
Similar News
News March 28, 2026
మచిలీపట్నం: కలెక్టరేట్‌లో నారాయణచార్యులు జయంతి

ప్రముఖ తెలుగు కవి, సాహిత్య విమర్శకులు పుట్టపర్తి నారాయణచార్యులు జయంతి కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ నారాయణచార్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. తెలుగులో ఆయన రచించిన కావ్యాల గురించి కలెక్టర్ ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.
News March 28, 2026
కృష్ణా: పదో తరగతి బయోలాజికల్ సైన్స్ పరీక్ష ప్రశాంతం

పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం బయోలాజికల్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 148 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. 21,716 మంది విద్యార్థులకు గాను 21,408 మంది హాజరయ్యారన్నారు. 308 మంది గైర్హాజరు కాగా హాజరు శాతం 98.18% నమోదైందన్నారు. డీఈవోగా తాను 4 కేంద్రాలను తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 32 కేంద్రాలను తనిఖీ చేశాయన్నారు.
News March 27, 2026
మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించండి: MP బాలశౌరి

మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కోవిడ్ సమయంలో మచిలీపట్నం-తిరుపతి రైలును నిలిపివేశారని, అప్పటి నుంచి మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిలిచిపోయిన రైలును పునరుద్ధరించాలన్నారు.


