News November 20, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, NOV 24 నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారుతుందని ఇప్పటికే ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Similar News

News November 21, 2025

గిల్‌కు నేడు ఫిట్‌నెస్ టెస్ట్

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ గిల్ ఫిట్‌నెస్ టెస్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌తోపాటు గువాహటి వెళ్లిన గిల్.. నిన్న ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. అతడు మ్యాచ్ ఆడే ఛాన్స్‌లు తక్కువేనని సమాచారం. గిల్ కోలుకుంటున్నారని, ఇవాళ సాయంత్రం ఫిజియోలు, డాక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. తొలి టెస్టులో మెడ నొప్పితో గిల్‌ మైదానాన్ని వీడటం తెలిసిందే.

News November 21, 2025

గుమ్మానికి నిమ్మ, మిరపకాయ ఎందుకు కడతారు?

image

ఇళ్లు, షాప్‌ గుమ్మాలకు, వాహనాలకు నిమ్మ, మిరపకాయలు కడుతుంటారు. ఇది చెడు దృష్టిని తొలగిస్తుందని నమ్మకం. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాల వాడకం పెంచేందుకే పూర్వీకులు ఈ పద్ధతిని ప్రోత్సహించారని అంటారు. ఇలా కడితే ఇంటి చుట్టూ ఉండే వాతావరణం శుభ్రమవుతుంది. వాహనాలకు వీటిని తగిలించడం వలన వీటిలోని సానుకూల శక్తి చుట్టూ ఉండే చెడు దృష్టిని తొలగించి, ప్రమాదాలు జరగకుండా కాపాడుతుందని విశ్వాసం.

News November 21, 2025

ఓట్ల సవరణ ఆపండి.. ECకి మమతా బెనర్జీ లేఖ

image

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)ను నిలిపివేయాలని CEC జ్ఞానేశ్ కుమార్‌కు బెంగాల్ CM మమతా బెనర్జీ లేఖ రాశారు. ‘BLOలు పరిమితి దాటి పని చేస్తున్నారు. EC తీరు ఆమోదయోగ్యంగా లేదు. వారికి సపోర్టుగా నిలిచేది పోయి బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న SIRను ఆపాలని కోరుతున్నా. వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వండి. ప్లానింగ్ లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రమాదకరం’ అని పేర్కొన్నారు.