News November 20, 2025
MNCL: జాతీయ స్థాయి కీలక ఖనిజాభివృద్ధి కమిటీలో సింగరేణి ఛైర్మన్

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కీలక ఖనిజాల గుర్తింపు, అన్వేషణ, ఉత్పత్తి చేయడం కోసం నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీలో సింగరేణి సంస్థ సీఅండ్ ఎండీ బలరామ్ సభ్యులుగా నియమితులయ్యారు. దేశ కీలక ఖనిజ ప్రణాళికల వేగవంతం, స్వదేశీ వనరుల అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో సింగరేణి పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నియామకం సంస్థ ప్రతిష్టను మరింత పెంచనుంది.
Similar News
News March 11, 2026
దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ మరోసారి దాడి చేసింది. డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఎయిర్‌పోర్టులో ఉన్న భారతీయుడు సహా నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. విమానాశ్రయం నుంచి భారీగా పొగ వెలువడుతోంది. మరోవైపు విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇటీవల కూడా దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి చేసింది. తమపై దాడి చేస్తున్న US-ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నాయని గల్ఫ్ దేశాలపై ఇరాన్ అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే.
News March 11, 2026
వేట్లపాలెం ఘటనపై CM సీరియస్

CM చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే వేట్లపాలెం ఘటనపై CM తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ఈ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ రెండు రోజుల పాటు ఈ సమావేశంలో పాల్గొని జిల్లా అభివృద్ధి, పాలనాంశాలపై నివేదికలు సమర్పించనున్నారు.
News March 11, 2026
టీడీపీ నేత నూర్ మహమ్మద్‌కు ఎమ్మెల్యే పరామర్శ

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ నేత నూర్ మహమ్మద్‌ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరామర్శించారు. సమయాభావం వల్లే తాను నూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వెళ్లలేకపోయానని ఆయన వివరణ ఇచ్చారు. డివిజన్ నేతల మధ్య వ్యక్తిగత విభేదాల వల్లే మనస్తాపం చెంది ఈ చర్యకు పాల్పడ్డారని వివరించారు. ఈ చిన్న విషయాన్ని రాజకీయ నిరుద్యోగులు భూతద్దంలో చూడవద్దని హితవు పలికారు.


