News November 20, 2025

WNP: గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

image

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లుపూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ గిరిధర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసీసీ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ఎంసీసీ ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగం సిద్ధం చేసుకోవాలన్నారు.

Similar News

News March 21, 2026

ఉదయాన్నే కాఫీ/టీ తాగితే..

image

కాఫీ, టీ తాగితే మంచిదా? కాదా? అనే అంశంపై విభిన్న ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా USకు చెందిన హార్వర్డ్, MIT సైంటిస్టులు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఉదయాన్నే కెఫిన్ ఉన్న కాఫీ/టీని మితంగా తీసుకుంటే డిమెన్షియా(మతిమరుపు) ప్రమాదం 18% తగ్గుతుందని పేర్కొన్నారు. స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. 43 ఏళ్లలోపు వయసున్న 1,31,821 మంది డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని తెలిపారు.

News March 21, 2026

తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది: బండి సంజయ్

image

తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇది ప్రజలను వంచించే బడ్జెట్ అని, అంకెల ఆర్భాటాలు తప్ప ఒరిగేదేమీ లేదని మీడియాతో అన్నారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేశారని ఫైరయ్యారు. ‘డ్రగ్స్ కేసులో సీఎంకు చిత్తశుద్ధి లేదు. ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే’ అని ఆరోపించారు.

News March 21, 2026

నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం

image

నెల్లూరు జిల్లాలో వరి పంట చేతికోస్తుంది. ఈక్రమంలో అకాల వర్షాలు రైతులను ముంచేసింది. అనంతసాగరం, కలవాయి,రాపూరు, మర్రిపాడు మండలాల పరిధిలో ఇటీవల వర్షం కురిసింది. దీంతో 19 గ్రామాల పరిధిలో వరి 1157 హెక్టర్లు, పత్తి 140 హెక్టర్లలో మొత్తంగా 1297 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు.