News November 20, 2025
హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచిన KTR: సబిత

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు దిగిందని మాజీ మంత్రి, మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. ప్రతి పక్షాన్ని, ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం CM రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకతతో ఫార్ములా-ఈ రేసులను నిర్వహించి హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచిన KTRపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమని ఆమె అన్నారు.
Similar News
News March 20, 2026
వనపర్తి: రైతుబీమాపై సర్కార్ నాటకం: నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబీమాను ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో అందరికీ రూ.5 లక్షల జీవిత బీమా అని ప్రకటించి, సాయంత్రానికి కేవలం రేషన్ కార్డు ఉన్నవారికేనని మాట మార్చారని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పినట్లు కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రీమియం కట్టి బీమా వర్తింపజేస్తుందా అని ఆయన ప్రశ్నించారు.
News March 20, 2026
SKLM- HYDకి డైరెక్ట్ ట్రైన్స్ ఏర్పాటే నా లక్ష్యం: రామ్మోహన్

AP: శ్రీకాకుళం నుంచి నేరుగా HYD, తిరుపతికి రైలు సర్వీసుల ఏర్పాటే తన లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం(D) హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ మంజూరైన 3 రైళ్లను ఆయన ప్రారంభించారు. 45 రోజుల్లోనే 6 రైల్వే స్టాప్‌లకు అనుమతి రావడం గర్వకారణమన్నారు. రవాణా వ్యవస్థను మరింత బలపరిచి, ఉపాధి అవకాశాలనూ పెంచే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
News March 20, 2026
నక్కపల్లి: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ

నక్కపల్లి మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో అత్యున్నత స్థాయి భద్రత, ప్రోటోకాల్ అమలు చేయాలని ఐజీ ఆదేశించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించారు.


