News November 20, 2025
నేరాలు జరిగితే యంత్రాంగం తక్షణమే స్పందించాలి: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీలపై దాడులు, నేరాలు జరిగితే యంత్రాంగం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం జిల్లా స్థాయి పర్యవేక్షణ, నిఘా కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు అత్యాచార నిరోధక చట్టం రక్షణ వలయంగా ఉందని కలెక్టర్ అన్నారు. చట్టం పక్కాగా అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.
Similar News
News March 12, 2026
NGKL: నిప్పుల కొలిమిలా ఎండలు

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకూ ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా పెంట్లవెల్లి మండలంలో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తాడూర్ మండలంలో 38.4, అచ్చంపేట మండలంలో 38.1, తిమ్మాజిపేట, ఊర్కొండ, తెలకపల్లి మండలాల్లో 37.9, కల్వకుర్తి మండలంలో 37.7, వంగూరు మండలంలో 37.5 ఉప్పునుంతల 37.4, డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 12, 2026
పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు.. ఉత్తర్వులు జారీ

AP: సర్పంచ్‌ల పదవీ కాలం APR 2తో ముగియనుంది. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. MRO, MPDO, MEO, డిప్యూటీ MPDO, వీరి కంటే ఎక్కువ హోదా కలిగిన వారిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలని సూచించింది. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టేవరకు వీరు పాలన కొనసాగించాలంది. రాష్ట్రంలో 13,100 గ్రామ పంచాయతీలు ఉన్న విషయం తెలిసిందే.
News March 12, 2026
నల్గొండలో బరి తెగిస్తున్న వడ్డీ మాఫియా

నల్గొండ జిల్లాలో అనధికార వడ్డీ వ్యాపారులు బరితెగిస్తున్నారు. నూటికి పది రూపాయల వరకు అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యులను వేధిస్తున్నారు. అప్పు తీర్చలేదన్న నెపంతో దాడులకు తెగబడుతుండటంతో పేదలు, చిరు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఎల్లారెడ్డిగూడెంలో వడ్డీ డబ్బుల విషయంలో ఫైనాన్సర్లు జరిపిన దాడిలో ఒక వ్యక్తి మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


