News November 20, 2025

GWL: ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాలను పూర్తి చేయాలి

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం ఐడీఓసీ మందిరంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. మండలాలు, మున్సిపాలిటీల వారిగా పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇసుక ఇతర ఇంటి నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉన్నందున నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. గద్వాలలో కొత్తగా 300 మందికి ప్రోసిడింగ్ ఇచ్చామన్నారు.

Similar News

News March 21, 2026

USకు ఇరాన్ పంచ్.. 4000km దూరంలోని బేస్‌పైకి మిస్సైళ్లు

image

యుద్ధంలో ఇరాన్ దాడులు US, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇండియానా ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్‌ డియాగో గార్షియాపై 2 బాలిస్టిక్ మిస్సైళ్లు సంధించింది. ఇది ఇరాన్‌కు ఏకంగా 4000km దూరంలో ఉండటం గమనార్హం. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒక మిస్సైల్ గాల్లోనే పేలిపోయిందని US తెలిపింది. మరొకదాన్ని తమ SM-3 ఇంటర్‌సెప్టర్ అడ్డుకుందని పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News March 21, 2026

వెంకట్రావుపేటలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటలో శనివారం ఉరివేసుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వెంకట్రావుపేటలోని పెద్దమ్మ తండాకి చెందిన జరుఫుల రమేశ్ అనే వ్యక్తి గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరివేసుకొని మృతి చెందాడు. కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలే ఆయన మృతికి కారణమని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2026

NGKL: ప్రపంచ రికార్డు దిశగా SLBC సొరంగం

image

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టులో భాగంగా ఇన్‌లెట్ నిర్మాణ పనులను అధికారులు మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే దేవరకొండ వైపు అవుట్‌లెట్ పనులు సాగుతుండగా, రెండు వైపులా పనులను వేగవంతం చేశారు. 43.93 కి.మీ. పొడవైన ఈ సొరంగం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా రికార్డు సృష్టించనుంది. భద్రతా ప్రమాణాలతో పనులు ఆటంకం లేకుండా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.