News November 20, 2025

వేములవాడలో మరిన్ని సూచిక బోర్డుల ఏర్పాటు

image

వేములవాడ పుణ్యక్షేత్రంలో అధికారులు కొత్తగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భీమేశ్వర ఆలయంలో దర్శనాల నేపథ్యంలో దారితెలియక భక్తులు తికమకపడుతున్నారు. దీనికి తోడు అభివృద్ధి పనుల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించి ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిప్పాపూర్ బ్రిడ్జితో పాటు పట్టణంలోకి ప్రవేశించే రోడ్లు, ముఖ్య కూడళ్ల వద్ద ముఖ్యమైన ప్రాంతాలకు దారులను సూచిస్తూ పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Similar News

News November 24, 2025

పటాన్‌చెరు: బిడ్డ పుట్టిన సంతోషం లేకుండా చేసిన దొంగలు

image

పటాన్‌చెరు PS పరిధిలో తాళం వేసిన ఇంట్లో <<18371279>>చోరీ<<>> చేసి సుమారు 45 తులాల బంగారం, వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. సికింద్రాబాద్‌కు చెందిన ఉత్తమ్ పోచారం పరిధిలోని సాయిదర్శన్ కాలనీలో ఉంటున్నాడు. భార్య ప్రసవం కోసం కుటుంబ సభ్యులంతా ఈనెల 16న వెళ్లారు. ఇదే అదునుగా చూసిన దొంగలు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీమ్‌తో విచారణ చేపట్టారు.

News November 24, 2025

HYD: రూ.50 వేలకు 10th సర్టిఫికెట్!

image

నార్సింగి పోలీసుల దాడిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా నకిలీ సర్టిఫికెట్లు, బోనాఫైడ్‌ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క టెన్త్‌ సర్టిఫికెట్‌ను రూ.50,000కి, ఇంటర్‌ను రూ.75,000కి, డిగ్రీ సర్టిఫికేట్‌ను రూ.1.20 లక్షలకు అమ్మడం గమనార్హం.

News November 24, 2025

బీమా కంపెనీల విలీనం.. పార్లమెంటులో బిల్లు?

image

బ్యాంకుల తరహాలోనే ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల విలీన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఓరియంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లను ఒకే కంపెనీగా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారని తెలుస్తోంది. వాటిని ఆర్థికంగా మెరుగుపర్చడమే దీని ఉద్దేశం. 2018-19లో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ మధ్యలోనే ఆగిపోయింది. అప్పట్లో వీటి బలోపేతానికి కేంద్రం ₹17450Cr కేటాయించింది.