News November 20, 2025
ములుగు: ‘స్వయం ఉపాధి వ్యాపారాలు చేయాలి’

గ్రామీణ ప్రాంత మహిళలు, యువకులు స్వయం ఉపాధి వ్యాపారాలు చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని జిల్లా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి అన్నారు. ములుగులోని సంక్షేమ భవన్‌లో పీఎం-ఈజీపీ పథకాలపై ఆహ్వాన కార్యక్రమం జరిగింది. చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడానికి, వ్యాపారాలు చేయడానికి ఈ పథకం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ముందుకు వస్తే రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.
Similar News
News March 12, 2026
వికారాబాద్: గ్యాస్ సిలిండర్ల పేరుతో సైబర్ మోసాలు: ఎస్పీ

వంట గ్యాస్ సిలిండర్ల కొరతను సాకుగా చూపుతూ సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రజలను అప్రమత్తం చేశారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని, తక్షణ డెలివరీ, అదనపు సిలిండర్లంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. అధికారిక యాప్‌ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని ఆమె సూచించారు.
News March 12, 2026
కర్నూలులో 261 మంది ఇంటర్ విద్యార్థుల గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 4,590 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 4329 మంది మాత్రమే పరీక్ష రాశారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
News March 12, 2026
కిడ్నీలను కాపాడుకుందామా!

నేడు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు, చక్కెర తగ్గించాలి. బీపీ, షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. సొంత వైద్యంతో పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రమాదకరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. SHARE IT


