News November 20, 2025

TU: డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. 10838 విద్యార్థుల హాజరు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం ఉమ్మడి నిజామాబాద్ పరిధిలో గురువారం తొలి రోజు డిగ్రీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు 30 పరీక్ష కేంద్రాలలో 11519 మంది విద్యార్థులకు గాను 10838 మంది విద్యార్థులు హాజరు కాగా 681 మంది గైర్హాజరయ్యారు. ఉదయం డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, 6వ సెమిస్టర్ పరీక్షలు జరుగగా మధ్యాహ్నం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయని వెల్లడించారు.

Similar News

News November 23, 2025

కరీంనగర్: ఎక్సైజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా శ్రీనివాస్

image

తెలంగాణ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా మిట్టపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కొంపెల్లి చిరంజీవి ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా రాజేందర్, ఉపాధ్యక్షులుగా వి. రాజశేఖర్ రావు, కోశాధికారిగా తమ్మిశెట్టి వినోద్ ఎన్నికయ్యారు.

News November 23, 2025

కరెంటు షాక్‌కు గురైన యువకుడు..చికిత్స పొందుతూ మృతి

image

ముంచుంగిపుట్టు (M) మర్రిపుట్టు గ్రామంలో శ్రీధర్ అనే యువకుడు ఎలక్ట్రిక్ స్టవ్ రిపేర్ చేస్తూ ఆదివారం కరెంట్ షాక్ గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని స్థానికులు ముంచుంగిపుట్టు ఆసుపత్రిలో చేర్చగా..అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి భార్య ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News November 23, 2025

AI ఎఫెక్ట్.. అకౌంట్ లాక్ చేసుకున్న ‘బందనా గర్ల్’

image

సెల్ఫీ వీడియోతో పాపులారిటీ సంపాదించుకున్న <<18363367>>‘బందనా (తలకు కట్టుకునే వస్త్రం) గర్ల్’<<>> ఎక్స్ అకౌంట్‌ లాక్ చేసుకున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ తన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా కొందరు AI ఫొటోలను క్రియేట్ చేసి దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ‘ఈ రోజు మేకప్ బాగా కుదిరింది’ అంటూ ఆమె ఆటోలో తీసుకున్న 2 సెకన్ల వీడియో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.