News November 20, 2025

అనకాపల్లి: ధాన్యం కొనుగోళ్లకు చర్యలు

image

జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయిన నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జేసీ జాహ్నవి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు ఈ-బ్యాంక్ గ్యారంటీలని పౌర సరఫరాల శాఖకు సమర్పించాలన్నారు. ధాన్యం సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

Similar News

News November 22, 2025

శుక్ర మౌఢ్యమి.. 83 రోజులు ఈ శుభకార్యాలు చేయొద్దు: పండితులు

image

ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది FEB 17 వరకు(83 రోజులు) శుక్ర మౌఢ్యమి ఉందని పండితులు వేదస్మార్త గురురాజుశర్మ తెలిపారు. ‘శుభాలకు అధిపతులైన గురు, శుక్రుడు ఈ మూఢాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని కోల్పోతాయి. ఈ రోజుల్లో వివాహం, గృహప్రవేశాలు, వాహనాల కొనుగోళ్లు, బోర్లు తవ్వించడం, పుట్టువెంట్రుకలు తీయడం, యాత్రలకు వెళ్లడం వంటివి చేయొద్దు. నిత్యారాధన, సీమంతాలకు ఈ దోషం వర్తించదు’ అని పేర్కొన్నారు.

News November 22, 2025

జిల్లాలో నూతనంగా 108 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన

image

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణకు సంబంధించి నూతనంగా 108 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఆమె అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 1200 ఓటర్లు పైబడిన ఉన్నచోట నూతన పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.

News November 22, 2025

పుట్టపర్తికి చేరుకున్న సీఎం, మంత్రి లోకేశ్

image

​భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తికి చేరుకున్నారు. వారికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సీఎం, లోకేశ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం వారు ప్రశాంతి నిలయంలో జరిగే శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.